నయనతార మొదటిసారి ఇలా…

సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్న నయనతార చాలా కాలంగా ఎంతో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సొంతం చేసుకుంది.
పెళ్లి అయినప్పటికీ నయన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు

నయన్ ఇప్పుడు తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తెలుగు సినిమా కోసం నయనతార తన రెమ్యూనరేషన్ ను ఎవరూ ఊహించని విధంగా తగ్గించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ముందుగా ఈ సినిమా కోసం నయనతార రెమ్యూనరేషన్ రూ.18 కోట్లు అని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు ఆఖరిగా ఆమె పారితోషికాన్ని నిర్మాతలు రూ.6 కోట్లకు ఫిక్స్ చేసినట్టు సమాచారం.
కెరీర్ స్టార్టింగ్ నుంచి రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూనే వెళ్తున్న నయన్ తన కెరీర్లో మొదటిసారి రెమ్యూనరేషన్ ను తగ్గించింది.
