అమెతో పోలిస్తే ఈమె…

శోభిత ధూళిపాలను రెండో వివాహం చేసుకున్న నాగచైతన్య వ్యక్తిగత జీవితంతోపాటు సినిమాలను ప్రపంచంగా ఉన్నాడు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలోకి వచ్చి నాగచైతన్య 16 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మీడియా ఇంటర్వ్యూ చేయగా ఆసక్తికర విషయాలు చైతూ పంచుకున్నాడు.

ప్రేమ కథ సినిమాల్లో ప్రేక్షకులు మిమ్మల్ని చూడడానికి ఇష్టపడతారని చెప్పగా చైతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘అక్కినేని కుటుంబం అంటేనే ప్రేమమయం’ అని చెప్పి ఆశ్చర్యపరిచాడు. తాత (ఏఎన్నార్) దగ్గరి నుంచి తాము చేసిన ప్రేమ కథలు ప్రేక్షకులు భారీ హిట్ చేశారు. తమకు దక్కిన హిట్‌లలో ప్రేమకథలు ఎక్కువ ఉన్నాయని గుర్తుచేశాడు. ప్రేమకథ చిత్రాలను ఇప్పుడు మిస్ అవుతున్నట్లు చెప్పాడు

గతం కన్నా ఇప్పుడు పరిణితి చెందినట్లు నాగచైతన్య చెప్పుకొచ్చాడు. ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు.. తప్పు ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు. తన కెరీర్ తొలినాళ్లలో నాన్న నాగార్జున చెప్పిన సూత్రాన్ని పాటిస్తూ ముందుకువెళ్తున్నట్లు చైతూ వివరించాడు.

ఇక తన భార్య శోభిత విషయమై అడగ్గా నాగచైతన్య మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు. ‘నన్ను హీరోగా ప్రేమించేవాళ్లు.. నా మంచి కోసం విమర్శించేవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నా భార్య శోభిత విశ్లేషణ బాగుంటుంది’ అని చైతూ చెప్పాడు. తను ఒక ప్రేక్షకుడిాగా సినిమాను చూసి తన అభిప్రాయం చెబుతుందని నాగచైతన్య వివరించాడు.
