జుట్టు బాగా రాలిపోతుందా…దీనితో మాయం…

ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్నప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి… | దీనిని నివారించడానికి అందరూ వివిధ మార్గాలను ప్రయత్నిస్తుంటారు.హెయిర్ కేర్ కోసం రకరకాల చిట్కాల ట్రై చేసినా ఫలితం కనిపించదు. కొన్నిసార్లు జుట్టు రాలిపోవడం ఆగడానికి బదులు సమస్య ఇంకా తీవ్రమవుతుంది.మీకూ ఇలాంటి పరిస్థితి ఎదురైంటే ఇక్కడ కొన్ని సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి .

నిజానికి, మనం తినే ఆహారమే జుట్టు , చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల మీ చర్మం ఆరోగ్యంగా, తాజాగా, ప్రకాశవంతంగా కనిపించాలన్నా లేదా జుట్టు బలంగా, పొడవుగా, అందంగా ఉండాలని మీరు కోరుకుంటే రోజువారీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే, ఇది చాలా అవసరం. ముఖ్యంగా విటమిన్ B5 అధికంగా ఉండే గుడ్లు, పెరుగు వంటి ఆహారాలను తప్పక తినండి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు బయటి నుండి జుట్టును ఎలా పోషించాలో మీకు తెలియకపోతే ఇక్కడ ఒక సాధారణ చిట్కా ఉంది. ఒక చిన్న గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆముదం నూనె తీసుకోండి. దాంట్లో కొన్ని మెంతులు వేసి బాగా మరిగించాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను మీ తలకు బాగా రాయండి. మరుసటి రోజు ఉదయం జుట్టును షాంపూతో కడగాలి. రాత్రిపూట ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. దీని ఫలితం కొన్ని రోజుల్లోనే మీకు తెలుస్తుంది.
