Spread the love

ఐరన్ లెగ్ నేను కాదు…| ఆ హీరో… |

లోక నాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీకి పరిచియం అయిన శృతి హాసన్..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాప్‌లతో శృతి హాసన్ సతమతం అయింది. పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో శృతి హాసన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి పాపులారిటీని తెచ్చుకుంది.

బాలకృష్ణతో ”వీరసింహారెడ్డి”, నానితో ”హయ్ నాన్న” సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించింది. సలార్‌తో మరో హిట్‌ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.

తాజాగా ఈ భామ ఓ ఇంటర్య్వూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కెరీర్ స్టార్టింగ్‌లో శృతి హాసన్ చేసిన సినిమాలు ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో శృతి హాసన్‌కు ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. దీనిపై తాజాగా ఈ బ్యూటీ స్పందించింది. కెరీర్ స్టార్టింగ్‌లో తాను సిద్దార్థ్‌తో వరుస సినిమాలు చేశానని, ఆ సినిమాలు ఫెయిల్ అయ్యాయని, అప్పుడు ఎవరు ఐరన్ లెగ్ అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ అందరూ కష్టపడే పని చేస్తామని, హిట్ కోసమే అందరం కలిసి చేస్తామని కానీ అది మన చేతుల్లో ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శృతి హాసన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.