ఐపిఎల్ 2025 షెడ్యూల్… |
భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ సీజన్ వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టోర్నమెంట్‌ను దాదాపు వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. దీంతో అభిమానుల్లో ఓ ప్రశ్న మొదలైంది. IPL 2025లో మిగిలిన 16 మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయి? అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇరుదేశాల మధ్య పెరుగుతున్న సైనిక వివాదం కారణంగా, భద్రతా సమస్యలను దృష్టిలో ఉంచుకుని IPL 2025 ను తాత్కాలికంగా వాయిదా వేయాలని BCCI నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను కొనసాగించడం సముచితం కాదని బోర్డు అధికారి ఒకరు తెలిపారు

అదే సమయంలో, కొన్ని నెలల తర్వాత (జులై, ఆగస్ట్) ఐపీఎల్ 2025 మళ్ళీ ప్రారంభమవుతుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
