డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే

కొబ్బరి నీళ్లు శక్తిని అందించే సహజ డ్రింక్. వేసవిలో తాగితే శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. కానీ మధుమేహం ఉన్నవారు దీన్ని తాగాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ నీటిలో ఉండే సహజ చక్కెరల వల్ల రక్త చక్కెర స్థాయిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
కొబ్బరి నీళ్లలో సహజంగా ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాల ప్రభావం మీద శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొబ్బరి నీళ్లు తాగిన కొద్దిసేపటికే రక్తంలో చక్కెర స్థాయి కొంత మేర పెరిగే అవకాశం ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. కానీ మితంగా తీసుకోవడం ముఖ్యం

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే.. అయితే మధుమేహం ఉన్నవారు దీన్ని తీసుకునేటప్పుడు ఆలోచించి, మితంగా, శరీర పరిస్థితులను గమనిస్తూ తీసుకుంటే మంచిది.
