Spread the love

తాత, మనవడితో కలిసి హీరోయిన్..

ఈ టాలీవుడ్ హీరోయిన్ మూడు తరాల హీరోల సరసన నటించింది. కెరీర్‌లో ఎన్నో హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టింది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడం, బాలీవుడ్ ఇండస్ట్రీలలోనూ నటించింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. అందంతోనే కాదు తన నటనతోనూ ఎంతోమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. తన సినీ కెరీర్‌లో అనేక హిట్, బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించింది. తెలుగు, కన్నడ, తమిళం.. అలాగే హిందీ చిత్రాల్లో చేసింది. అన్ని ఇండస్ట్రీలలోనూ టాప్ హీరోల సరసన చేసింది. ఈమె బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో కూడా తన నటనతో అలరించింది. ఆమె మూడు తరాల నటులతో కలిసి పని చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్‌లతో కలిసి పనిచేసింది.

మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన ఆమె.. అక్కినేని హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు నుంచి అక్కినేని అఖిల్ వరకు అందరితోనూ నటించింది. 1984లో ‘కంచు కాగడ’ సినిమాతో రమ్యకృష్ణ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ నటించింది. ఫిరోజ్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దయావన్’ అనే క్రైమ్ సినిమాలో నటించిన ఆమె.. పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇక 1993లో జాకీ ష్రాఫ్, మాధురీ దీక్షిత్, సంజయ్‌దత్‌లతో కలిసి రమ్యకృష్ణ నటించిన ‘ఖల్నాయక్’ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇందులో ఓ పాట అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది.