Spread the love

శ్రీవారి భక్తులకు శుభవార్త…|

తిరుమలకు వెళ్లే భక్తుల కోసం రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. తిరుపతిలో శ్రావణ మాసం.. వరస సెలవుల వేళ కొండ మొత్తం భక్తులతో నిండింది. ఈ నెలాఖరు వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రెగ్యులర్ రైళ్లు నిండటం తో అదనపు రైళ్ల నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు రైళ్ల రూట్.. షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు.

శ్రావణ మాసంలో శ్రీవారిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో, రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. వీటిని ఆగస్టు 17, 18 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే (07097) నెంబర్ గల ప్రత్యేక రైలు ఆదివారం తిరుపతి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే (07098) నెంబర్ గల మరో ప్రత్యేక రైలు ఆగస్టు 18వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, 2ఏసీ 3 ఏసీ, ఎకానమీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు. ఇక.. వినాయక చవితి వేళ సైతం పలు రైళ్లు ఇప్పటికే వెయిటింగ్ లిస్టులతో ఉన్నాయి. దీంతో..రద్దీ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్ల పైన కసరత్తు జరుగుతోంది. దసరాకు రిజర్వేషన్ ప్రారంభం కావటంతో.. ప్రధాన మార్గాల్లో ఈ వారంలో నే ప్రత్యేక రైళ్లను అధికారులు ప్రకటించేందుకు సిద్దం అవుతున్నారు.