వారానికి ఒకసారి మటన్ తింటున్నారా
మటన్‌ను తినడం వల్ల అసలు ఎలాంటి లాభాలు కలుగుతాయి..?

మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన నాన్ వెజ్ ప్రియులు మటన్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మేక మాంసం అంటే చాలా మందికి ఇష్టమే. మన దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన వారు ఏ శుభకార్యం జరిగినా సరే మటన్ కచ్చితంగా పెడతారు.

అయితే మటన్‌ను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు మటన్‌లో ఉంటాయి. మటన్‌లో మన శరీరానికి అవసరం అయ్యే 9 రకాల ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మత్తులకు ఎంతగానో దోహదం చేస్తాయి.

వీటి వల్ల శరీరం తనకు తాను సులభంగా మరమ్మత్తులు చేసుకుంటుంది. అలాగే మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను సైతం శరీరం సులభంగా శోషించుకుంటుంది. దీంతో పోషకాహార లోపం తగ్గుతుంది.
