శంకర్ తో చిరంజీవి… |

మెగాస్టార్ చిరంజీవి.. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నారు. రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నారు.
ఆయన్ని హీరోగా, ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా కొన్ని మెట్లు ఎక్కించిన చిత్రాలు అనేకం.
అదే సమయంలో కొన్ని హిట్ చిత్రాలను కూడా చిరు మిస్ చేసుకున్నారు. అవి చేసి ఉంటే తన కెరీర్‌లో మరో గొప్ప స్థాయి ఉండేదని చెప్పొచ్చు.

చిరంజీవి.. దర్శకుడు శంకర్‌తో పనిచేసే అవకాశాన్ని రెండు సార్లు రిజెక్ట్ చేయడం గమనార్హం. దర్శకుడు శంకర్ కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్‌గా రాణించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.
శంకర్ తన తొలి సినిమా చిరంజీవితో చేయాలనుకున్నాడట. ఆయన అర్జున్‌తో `జెంటిల్ మెన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి శంకర్‌పై పడింది.
ఆరేళ్ల తర్వాత అర్జున్‌తో ఒకే ఒక్కడు సినిమా చేశాడు శంకర్.
శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ ని ముందుగా చిరంజీవికే చెప్పారట.

తమిళంలో అర్జున్‌తో, తెలుగులో చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ చిరు నో చెప్పాడు. కారణం ఆయనకు డేట్స్ లేకపోవడమే. అదే చేసి ఉంటే ఠాగూర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా చిరంజీవికి పడేది అని చెప్పొచ్చు. అలా శంకర్ తో రెండు బ్లాక్ బస్టర్స్ ని మిస్ చేసుకున్నారు శంకర్.
ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర, అలాగే అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. విశ్వంభర ఈ ఏడాది చివర్లో వచ్చే ఛాన్స్ ఉంది. అనిల్ రావిపూడి మూవీ వచ్చ ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.
