ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్..

టాలీవుడ్ యంగ్ టైగర్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఈనెల 20న తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. తమ అభిమాన హీరో బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ఫ్యాన్స్ అప్పుడే ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.

స్టార్ హీరోల పుట్టిన రోజుల సందర్భంగా సినిమా బృందాలు అప్‌డేట్‌లను అందిస్తాయి. వీటి కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలా ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు తమ హీరో కొత్త సినిమా అప్డేట్స్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వార్ 2 సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ కావొచ్చిని అధికారికంగా అప్డేట్ వచ్చింది. దీంతో పాటు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా , ప్రశాంత్ నీల్ తో సినిమా అప్డేట్ కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే వారికి నిర్మాణ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రశాంత్ నీల్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్ విడుదల చేయబోమని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ప్రకటించింది. దీనికి కారణం కూడా వారు వివరించారు. ‘ఇది పూర్తిగా ‘వార్ 2’ టైమ్.. మేం ఈ సినిమాను గౌరవిస్తున్నాం. మన మారణహోమాన్ని ప్రారంభించే ముందు.. దీన్ని సెలబ్రేట్ చేసుకుందాం. మన మాస్ మిస్సైల్‌ను సరైన సమయంలో విడుదల చేద్దాం. ఈ పుట్టినరోజును ‘వార్ 2’తో చేసుకోండి’ అంటూ అభిమానులను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ప్రశాంత్‌నీల్ మూవీ నుంచి అప్‌డేట్ లేదని క్లారిటీ వచ్చేసింది.

ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. అయితే డ్రాగన్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇది పూర్తి యాక్షన్ సినిమాగా ఉంటుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈమూవీ జూన్ 25, 2026న థియేటర్లలో విడుదల అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
