చికెన్ ఎముకలు తింటున్నారా? ఏమవుతుందో తెలుసా!
బ్రాయిలర్ చికెన్ చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఈ బ్రాయిలర్ కోళ్లు మాంసం కోసం పెంచే కోళ్లు. వీటిని త్వరగా పెద్ద చేయడానికి వాటికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ తో కూడిన ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు. అటువంటి బ్రాయిలర్ కోడి మాంసాన్ని తినడం మాత్రమే కాకుండా ఎముకలు కూడా రుచిగా ఉన్నాయని నమిలే వారు ఉంటారు. అయితే అలాంటి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.

బ్రాయిలర్ కోడి ఎముకలు తినడం ఏమాత్రం మంచిది కాదు. అంటే ఇవి వేగంగా పెరగడానికి కావలసిన హార్మోనల్ ఇంజక్షన్స్ ఇవ్వడం వలన, ఆ హార్మోనల్ ఇంజక్షన్ల ప్రభావం వాటి ఎముకల పైన ఉంటుంది. ఎప్పుడైతే బ్రాయిలర్ కోడి తో పాటు ఎముకలు తింటారో అటువంటివారు అనవసరపు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. బ్రాయిలర్ కోడి ఎముకలు మన శరీరానికి హాని చేస్తాయి.

కృత్రిమంగా పెంచిన కోళ్ళ ఎముకలు తినడం కారణంగా బరువు విపరీతంగా పెరుగుతుంది. మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక వీటిలో పోషక విలువలు తక్కువగా ఉండటం వల్ల వీటిని తినడం ఏమాత్రం మంచిది కాదు. బ్రాయిలర్ కోళ్లలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ ఎముకలను తినడం వల్ల కొన్ని సందర్భాలలో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ ఎముకలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో పేగులలో అడ్డంకులు లేదా గాయాలకు కారణమవుతుంది. చికెన్ ఎముకలు తినే సమయంలో మరో ప్రమాదం కూడా ఉంటుంది. పొరపాటున గొంతులో ఇరుక్కుపోతే అనవసరమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు శ్వాసనాళం లో చికెన్ ముక్క ఇరుక్కుపోయి ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఉంటాయి.
చాలామంది కోడి ఎముకలలో ఉన్నటువంటి మూలుగను తినడానికి ఇష్టపడతారు. అయితే నాటుకోడి మజ్జ తింటే పర్వాలేదు కానీ, బాయిలర్ కోడి ది మాత్రం పొరపాటున కూడా తినకూడదు కనుక చికెన్ తినాలని భావించేవారు ఎముకలలోని మజ్జ రుచిగా ఉందని తినకండి. అనర్ధాలకు కారణమవుతుంది ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది
