Spread the love

సగం తిన్న ఆపిల్ ఎంతో తెలుసా… |

అప్పట్లో సిల్క్ స్మిత క్రేజ్ ఏమిటో చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనం. సిల్క్ స్మిత ఎంగిలి చేసిన ఆపిల్ ని వేలం వేశారట. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారట.

చిన్న, చిన్న రోల్స్ చేస్తోన్న ఆమెను.. ‘ఇనయే తేడి’ సినిమాతో మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్ హీరోయిన్ చేశాడు. ఆ తర్వాత ఆమె నటించిన తమిళ చిత్రం.. ‘వండిచక్రం’ మంచి హిట్ అయింది.

1984 లో ఒక సారి షూట్ బ్రేక్‌లో సిల్క్ స్మిత యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట.

సిల్క్ సగం తిన్న యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కున్నారట

అది సిల్క్ స్మితకు ఉన్న డిమాండ్…