మన ముందుకు మారో రామారావు

ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి చాలా కాలం విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన తాజాగా ఒక ప్రత్యేకమైన సినిమాతో పునరాగమనాన్ని ప్రకటించారు.

ఈ చిత్రంతో వైవిఎస్ చౌదరి ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన మరో తరం వారసుడు ను కథానాయకుడిగా పరిచయం చేస్తుండడం గమనార్హం. స్వర్గీయ ఎన్టీఆర్ మునిమనవడు ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడి పేరు కూడా నందమూరి తారక రామారావు కావడం విశేషం
