Spread the love

చిరంజీవి వల్లనే నేను..|

మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక్కమాటతో తాను 400 సినిమాల్లో నటించానని ఓ తెలుగు కమెడియన్ అన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని..ఆయన ప్రశంసే తనను ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ హాస్యనటుడు ఎవరు.. ? ఇంతకీ చిరు చెప్పిన మాట ఏంటో తెలుసుకుందామా.

అతడు మరెవరో కాదు.. రఘుబాబు. విలన్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు ఆ తర్వాత హాస్యనటుడిగా మారాడు. హాస్య విలన్‌గా అద్భుతమైన సినిమాలు తీసిన రఘుబాబు, బ్రహ్మానందం లాగానే తన పంచ్ డైలాగ్స్, ఎక్స్ ప్రెషన్స్ తో కడుపుబ్బా నవ్వించాడు. ఆది సినిమాలో పవర్ ఫుల్ విలన్.. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన బన్నీ చిత్రంలో విలన్ పాత్రలోనే నవ్వించాడు.

రఘుబాబు కామెడీ కోసమే తాను బన్నీ సినిమాను చాలాసార్లు చూశానని.. అందులో తన యాక్టింగ్ అద్భుతంగా ఉందని అన్నారు చిరు. ఆ ప్రశంసతోనే తాను ఇప్పటివరకు 400 సినిమాల్లో నటించానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రఘుబాబు.