వీటితో మి బోన్స్ సూపర్ స్ట్రాంగ్… |

ప్రస్తుత రోజుల్లో చాలామంది చిన్నవయసులోనే జాయింట్ పెయిన్స్ అంటూ బాధపడుతున్నారు.ఇందుకు కారణం ఎముకల బలహీనత…
ఈ నేపథ్యంలోనే బోన్స్ ను స్ట్రాంగ్ గా మార్చే ఓ సూపర్ పొడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం….
ముందుగా 150 గ్రాములు బాదం గింజలను( Almonds ) హాట్ వాటర్ లో పోసి తొక్క తొలగించి ఒక క్లాత్ పై తడి పడిపోయే వరకు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టుకుని అందులో తొక్క తొలగించిన బాదం గింజలు వేసుకోవాలి.
అలాగే గుప్పెడు పిస్తా పప్పు( pistachio nut ), గుప్పెడు జీడిపప్పు( cashew nut ) వేసుకుని చిన్న మంటపై గరిటె తో తిప్పుతూ డ్రై రోస్ట్ చేసుకోవాలి.చివరిలో గుప్పెడు వాల్ నట్స్ కూడా వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వేసుకోవాలి.వీటితో పాటు వన్ టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
ఒక గ్లాసు వేడి పాలల్లో ఒక స్పూన్ చొప్పున మిక్స్ చేసి తాగేయడమే…. |

