బాలయ్య బ్యూటీ వింత కోరిక!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు ఇటీవల కాలంలో అభిమానులు గుడి కట్టి పూజలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే… |
అయితే తాజాగా మరో నటి నాకు కూడా గుడి కట్టి పూజలు చేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి.
ఆ ముద్దుగుమ్మ ఎవరు అనే విషయానికొస్తే ఆమె మరెవరో కాదు దబిడి దిబిడి దంచుబాల అంటూ ప్రేక్షకులను సందడి చేసిన నటి ఊర్వశి రౌతేలా(Uravashi Rautela) అని చెప్పాలి.

డాకు మహారాజ్, వాల్తేర్ వీరయ్య, స్కంద( Daku Maharaj, Walther Veeraiah, Skanda ) సినిమాలలో ఐటం సాంగ్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
తాజాగా ఊర్వశి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ’ నార్త్ ఇండియాలో నా పేరు మీద ఓక గుడి(Temple) ఉంది.బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్నఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారు.ఇలా నార్త్ లో లాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా నాకోసం ఒక గుడి కట్టి పూజలు చేయండి అంటూ ఈమె మాట్లాడారు.

దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు
