Spread the love

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో షాక్… |

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు.( Hari Hara Veeramallu ) ఈ సినిమా అప్పుడెప్పుడో మొదలైంది.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఫుల్ బిజీ బిజీగా ఉండడం ఆ తర్వాత ఎలక్షన్స్ లో గెలిచి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఫుల్ బిజీగా మారిపోయారు.దీంతో ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా 70 శాతం వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ ఈ నెలలో ఎలాగైనా వీరమల్లుకి కాస్త సమయం కేటాయించి, చిత్రాన్ని పూర్తి చేయాలని భావించారు.కానీ ఇప్పుడు అది సాధ్యపడకపోవచ్చు.ఎందుకు అంటే తాజాగా సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్( Mark Shankar ) గాయపడిన సంగతి తెలిసిందే.

దీంతో పవన్ సింగపూర్ కి వెళ్ళారు.చేతులు, కాళ్ళకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తులకు పొగ పట్టేయడంతో మార్క్ కోలుకోవడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

ఈ లెక్కన మే 9కి వీరమల్లు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ విషయంలో నిరాశ ఎదురయింది అని చెప్పాలి.