Spread the love

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కెరీర్ కొనసాగించాలంటే అందం, అభినయంతో పాటు కూసింత అదృష్టం కూడా తోడుగా ఉండాలంటారు. అందుకే చాలామంది ఎన్నో కష్టాలకోర్చి ఇండస్ట్రీలోకి వచ్చినా పూర్తి స్థాయిలో సక్సస్ కాలేకపోతున్నారు. ఈ టాలీవుడ్ హీరోయిన్ కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది.

కెరీర్ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేసిందీ అందాల తార. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ సక్సెస్ మాత్రం రాలేదు. చివరకు సీరియల్స్ లోనూ ట్రై చేసింది. వేరే రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. కట్ చేస్తే.. ఈ అందాల తార ఇప్పుడు గూగుల్‌ ఇండియాలో పనిచేస్తోంది. అది కూడా హెడ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ రోల్‌లో. ఆమె పేరు మయూరి కాంగో.. పేరు చెచితే గుర్తు పట్టకపోవచ్చు.. కానీ మహేష్ నటించిన వంశీ సినిమా చెబితే చాలా మంది గుర్తు పడతారు. ఇందులో ఆమె మహేష్ స్నేహితురాలిగా, ఓ మోడల్ పాత్రలో కనిపిస్తుంది.

మహేష్ బాబుతో సినిమా చేసినా విజయం దరిచేరలేదు. చివరికి సీరియల్స్ చేసినా నిరాశే ఎదురైంది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది మయూరి.

తన ప్రతిభతో ప్రముఖ గ్లోబల్‌ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్‌ అనే కంపెనీలో ఎండీ హోదాలో పనిచేసింది. ప్రస్తుతం మయూరి కాంగో గూగుల్‌ ఇండియాలో పనిచేస్తోంది.

హెడ్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ రోల్‌లో కీలక బాధ్యతలు నిర్వర్విస్తోంది. గూగుల్‌ డిజిటల్‌ స్ట్రాటజీస్‌, ఇన్నోవేషన్స్‌ విభాగాన్ని పర్యవేక్షిస్తోన్న మయూరి కార్పొరేట్‌ రంగంలో తనదైన మార్క్‌ చూపిస్తోంది.