
రాష్ట్ర ఐటీ & ఎలక్ట్రానిక్స్,
విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో దివీస్ లాబొరేటరీస్ వారి సహకారంతో తాడేపల్లి నులకపేట
13 వ వార్డ్ లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను గురువారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ప్రారంభించారు. ఈసందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాగునీరు అందించేందుకు మంత్రి నారా లోకేష్ దివీస్ లాబోరేటోరీస్ వారి సహకారం తో వాటర్ ప్లాంట్ ఏర్పాటుచేయించారని,ప్రజల అవసరాలను గుర్తించి వెంటనే స్పందించే నాయకత్వం నారా లోకేష్ దని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంటిఎంసి
మున్సిపల్ ఏఈ అనూష,టీడీపీ
తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు,గోలి శౌరి, కాటాబత్తుల నిర్మల,ఇట్టా పెంచలయ్య,తాళ్లూరు శ్రీనివాస్, షేక్ నాగుల్ మీరావలి,షేక్ చాంద్ బాషా, షేక్ మస్తానయ్య, షేక్ బాబావాలి,షేక్ సైదా, దామర్ల దుర్గారావు, సింహాచలం,సుందర రావు,విజయ ఊర్మిళ,తదితరులు పాల్గొన్నారు.
