Spread the love

ప్రస్తుత రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా దాదాపు ప్రతి ఒక్కరూ తలనొప్పితో సావాసం చేస్తున్నారు.తలనొప్పి చిన్న సమస్య అయినప్పటికీ తీవ్రమైన బాధ‌కు, అసౌకర్యానికి గురిచేస్తుంది.

ఈ క్రమంలోనే తలనొప్పి నుంచి రిలీఫ్ పొందడం కోసం పెయిన్ కిల్లర్ వేసుకుంటారు.కానీ తరచూ పెయిన్ కిల్లర్స్( Pain killers ) వాడడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

అందుకే సహజంగా తలనొప్పిని పోగొట్టుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

విపరీతమైన తలనొప్పిని కూడా ఈ డ్రింక్ ఇట్టే పోగొడుతుంది.డ్రింక్ తయారీ కోసం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు( Anise seeds ) వేసుకోవాలి.

అలాగే రెండు దంచిన యాలకులు( Cardamom ) మరియు మూడు లవంగాలు( cloves ) వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.దాంతో మన మ్యాజికల్ డ్రింక్ అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసి నేరుగా తాగేయడమే.

తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే తక్షణమే ఉపశమనం పొందుతారు.ఈ డ్రింక్ ఒత్తిడి, ఆందోళన సమస్యలను దూరం చేస్తుంది.మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

తలనొప్పి నుంచి చాలా వేగంగా రిలీఫ్ ను అందిస్తుంది.మూడ్ ను సెట్ చేస్తుంది.

అలాగే ఈ డ్రింక్ ను మీరు రెగ్యులర్ గా కూడా తీసుకోవచ్చు.రోజు మార్నింగ్ టీ, కాఫీలకు బదులు ఈ డ్రింక్ తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.అలాగే ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి వెయిట్ లాస్ కు సహాయపడుతుంది.

శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుంది.