
చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని వేగంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా పురుషులలో ధూమపానం, మద్యం అలవాట్లు గుండె సమస్యలను ఆహ్వానిస్తాయి. అయితే అంతకంటే ముందు ఒంట్లో అధిక కొలెస్ట్రాల్ పెరిగి ఈ సమస్యలకు దారి తీసేందుకు కారణం అవుతాయి

నేటి జీవనశైలి కారణంగా పురుషులలో కూడా అధిక కొలెస్ట్రాల్ సమస్యలు పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ కాలేయంలో కొత్త కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి. దీనిని చెడు కొలెస్ట్రాల్ అంటారు. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం వలన గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఛాతీ నొప్పి, అలసట వంటివి అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు. అయితే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగితే ఆ లక్షణాలు గోళ్లు కూడా చెబుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు కలిగిన పురుషుల గోళ్లలో కనిపించే లక్షణాలు అధిక LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్ ఉందో లేదో ఇట్టే చెప్పేస్తాయ్.


