
ఒక చిత్రంలో నన్ను ఎంపిక చేశారు కాకపోతే అప్పటికే నాతో నటించే హీరోయిన్ లు మంచి రేంజ్ లో ఉండేవారు.
వారికి ఒకలా కొత్తగా వచ్చేవారికి ఒకలా ఉండేది మర్యాదలు. భోజనాలు సైతం తేడాగా ఉండేది.
సినిమాలో హీరో వేషం అయినప్పటికీ చాలా చులకనగా చూడబడ్డాను.
సినిమా సరిగ్గా తీయలేక విజయకాంత్ కు నటన రాదూ అందుకే సగంలో సినిమాను ఆపేసాం అని వెళ్ళిపోయిన డైరెక్టర్లు ఉన్నారు.
నాతో నటించను అని చెప్పిన నటీ మణులు ఉన్నారు.

అవమానాలాన్ని ఎన్నో భరించాను.
ఒక్కసారి శ్రీప్రియ ఇతడితో నటించను అని చెప్పారు.
సరిత రాధిక గారు కూడా అలానే అన్నారని విన్నాను.
ఇక్కడ పుకార్లకు కోదవే ఉండదు. నేను సరిత గారితో నటించనని చెప్పారని అనడంతో నేరుగా ఆవిడ ఇంటికే వెళ్ళి ఆమె తల్లితో కొన్ని మాటలు చెప్పాను.
అమ్మా సరితగారితో నేను నటించను అని ఎప్పుడూ చెప్పలేదు.ఇంత దూరం వచ్చి చెబుతున్నానంటే అలాగని సరితగారితో నటిస్తేనే నా జీవితం బావుంటుందని చెప్పడానికి రాలేదు.
నాకు ఎవరిపైన కోపము లేదు. నేను నటుడిని నటించడానికి వచ్చాను అంతే అని చెప్పి వచ్చేసారు.
కళా ప్రపంచంలానే ఇది కూడా కలల ప్రపంచం. కొందరు ఇతడితో నటిస్తే నీ కెరీర్ ఆగిపోతుంది అని చెప్పినప్పుడు ఆడపిల్లలు భయపడడంలో తప్పేముంది.
పుకారు పుట్టించిన వారి పైనే నాకు కోపం లేదు. ఇక అమ్మాయిలపైన నాకెందుకు కోపం అన్నారు ఆయన.

పరిశ్రమలో రజినీ కాంత్ ఒక్కడు ఉన్నాడు మళ్ళీ ఈ విజయ్ కాంత్ ఎందుకు అని హేళన చేశారు.
ఒకసారి హీరోయిన్ షూట్ కి రావడానికి చాలా ఆలస్యం అయ్యింది. అప్పటికే చాలా ఆకలిగా ఉండడంతో తినడానికి కూర్చున్నాను అంతే హీరోయిన వచ్చేసింది అని నన్ను లేపేశారు. అప్పుడు నేను చాలా బాధపడ్డాను.
ఆ తరువాత కొన్ని హిట్లు అందుకున్నాక నటించను అని అన్న నటీ మణులు నటించారు. నటన రాదన్న దర్శకులు నాతో చిత్రం చేశారు. అప్పుడు అనిపించింది ఎంత మాయ లోకం ఇది అని నవ్వుకున్నాను.
నేను ఆకలి విలువ తెలిసినవాడిని అందుకే అన్నం పెట్టడం నా అలవాటుగా మార్చుకున్నాను.పరిశ్రమకు రాకముందు నుండే ఆకలి తీర్చడం నాకు తెలుసు. ఇప్పటికి మా ఇంటికి ఎవరు వచ్చినా బేధం ఉండదు అందరికీ సమానంగా భోజనాలు ఉండేవి. మా ఇంటికి వచ్చినవారు చేతులు తడవకుండా వెళ్ళానిచ్చేవాడిని కాదు.
ఒకప్పుడు జీతాలు సరిపోలేదని రైస్ మిల్లు పనివాళ్ళు స్ట్రైక్ చేశారు. ఒక్క నా మిల్లు లో మాత్రమే ఆ స్ట్రైక్ లేదు ఎందుకంటే కష్టపడే వారిని నేను పస్తుపెట్టింది లేదు.
నా షూటింగ్ లో అందరికి సమానంగా భోజనాలు పెట్టించాను. ఒకరికి ఒకలా వేరొకరికి ఒకలా ఉండదు.నేను ఏదైతే తినేవాడినో అదే అహారన్నే అందేలా చూసుకున్నాను. ఆహారం లో బేధం చూపెడితే అంతకంటే దౌర్బాగ్యం వేరొక్కటి లేదు అని ఆయన అనేవారు.
జూనియర్ ఆర్టిస్ట్ ల నుండి కొత్తగా నటించాలని వచ్చే వాళ్ళ వరకు ఆయన ఇంట్లో తినకుండా ఉన్నవాళ్ళైతే లేదు. గేట్ లో వాచ్మాన్ ని అడ్రస్ అడగాలని వెళ్లినా సరే మొదట వచ్చి బోంచేయండి మళ్ళీ చూద్దాం అనేవారంట.
విజయకాంత్ ఎవర్నైనా సరే మొదట బోంచేయమనేవారు. ఆ తరువాతే విషయాన్ని చెప్పమని అడిగేవారు

