Spread the love

స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.ప్రభాస్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 150 నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ఫౌజీ సినిమాలో( Fauji Movie ) ఇమాన్వీ ఇస్మాయిల్( Imanvi Esmail ) మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అలియా భట్( Alia Bhatt ) నటిస్తున్నారని సమాచారం అందుతోంది.

అలియా భట్ ఈ సినిమాలో యువరాణి పాత్రలో కనిపించనున్నారని భోగట్టా అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రభాస్ తో కలిసి నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ప్రభాస్ తో సినిమా తీసిన ప్రతి దర్శకుడు తన రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచుకుంటున్నారు.అలియా భట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్న సంగతి తెలిసిందే.

అలియా భట్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.