Spread the love

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి,( Chiranjeevi ) బాలయ్య( Balayya ) క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా టాప్ లో ఉన్న హీరోలు అనే సంగతి తెలిసిందే.అయితే చిరంజీవి, బాలయ్య గురించి ప్రముఖ రచయిత్రి కేఎన్ మల్లీశ్వరి( KN Malliswari ) తాజాగా వ్యాసం రాయగా ఆ వ్యాసం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

మాట, చూపు, హావభావ కవళికలలో పెద్దమనిషితనం కనిపించేలా ఉండే చిరంజీవి దొరికిపోయారని ఆమె వెల్లడించారు.

ఆడపిల్లలతో నిండిన ఇల్లు చిరంజీవి హాస్టల్ లా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.

చిరంజీవి తను నటించిన హిట్లర్ సినిమా నిజం అనుకున్నారు కాబోలు అంటూ రచయిత్రి కామెంట్లు చేశారు.చిరంజీవి తమ లెగసీ కొనసాగించడానికి కొడుకును కనాలని బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారని మల్లీశ్వరి అభిప్రాయపడ్డారు.

కూతురు క్లీంకార ముఖం కూడా కనిపించకుండా కనిపించకుండా చిరంజీవి కొడుకూ కోడలూ తమ ఆడపిల్లకు ఎదురైన బహిరంగ వివక్షను ఎలా తీసుకుంటారో అది వారి కుటుంబ విషయం అని మల్లీశ్వరి వెల్లడించారు.ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించ్సదగినవి అని ఆమె చెప్పుకొచ్చారు.

స్త్రీల విషయంలో అసభ్యంగా ప్రవర్తించడంలో బాలయ్య గాడ్ ఆఫ్ వల్గారిటీకి ప్రతీకగా మారిపోయారని ఆమె చెప్పుకొచ్చారు

ఆమె చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి