యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ‘అర్జున్ రెడ్డి’ నుంచి ‘కబీర్ సింగ్’ వరకు తన టేకింగ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన సందీప్, ‘యానిమల్’తో మరోసారి సంచలనం సృష్టించాడు

ఇప్పటికే సందీప్ రెడ్డి తన లైన్‌అప్‌ను అనౌన్స్ చేశాడు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ను తెరకెక్కించనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత అతడు ఎవరి సినిమాకు కమిట్ అవుతాడన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టాలీవుడ్‌లో మాత్రం సందీప్ కోసం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య పోటీ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ సందీప్‌తో టచ్‌లో ఉన్నారని, తన తదుపరి చిత్రం తమతోనే చేయాలని చరణ్, బన్నీ ఇద్దరూ ఆసక్తిగా ఉన్నారని సమాచారం.
రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో తన 16వ సినిమాను చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక 17వ చిత్రాన్ని సుకుమార్‌తో ప్రారంభించనున్నాడు. ఈ రెండు చిత్రాల విడుదలయ్యేలోపు సందీప్ రెడ్డి తన రెండు సినిమాలను పూర్తి చేసుకుని రెడీ అవ్వాలి. సందీప్ హీరో కోసం వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు.

అటు అల్లు అర్జున్ విషయానికొస్తే, ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు.

ఇప్పుడు ఇరువురు హీరోలు సందీప్ కోసం పోటీలో ఉన్నారు .. ఎవరూ వెనక్కి తగ్గేలా లేరు. అయితే లాజికల్‌గా చూస్తే బన్నీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ – సందీప్ రెడ్డి కాంబినేషన్ సెటైయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రేసులో చరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది చూడాలి.
