సాయి పల్లవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

ఆచి చూసి సినిమాలలో నటిస్తూ సెలెక్టివ్ గా పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారు సాయి పల్లవి.
గ్లామర్ పాత్రలకు ఎక్స్పోజింగ్ పాత్రలకు దూరంగా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటోంది సాయి పల్లవి.

ఇటీవల శివకార్తికేయన్ ( Sivakarthikeyan )కు జంటగా అమరన్ ( Amaran )చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది సాయి పల్లవి.

తాజాగా మరో కోలీవుడ్ చిత్రం కోసం సాయి పల్లవి పేరు వినిపిస్తోంది.అదీ సంచలన నటుడు శింబుతో జత కట్టే విషయమై ప్రచారం జోరందుకుంది.శింబు( Simbu ) ఇప్పుడు నటుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం( Mani Ratnam ) దర్శకత్వంలో నటించిన థగ్‌లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించారు.ఈ చిత్రం జూన్ లో తెరపైకి రానుంది.

ఇకపోతే శింబు నటించిన గత సినిమాలను పరిశీలిస్తే ఎక్కువగా హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్ లేదా సాంగ్స్ ఉండటం సహజం.
