Spread the love

ఊర్వశి రౌటేలా.( Urvashi Rautela ) ఇటీవల బాలయ్య బాబు( Balayya Babu ) హీరోగా నటించిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా సమయం నుంచి ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.

బాలయ్యతో కలిసి ఊరమాస్ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమా ఊర్వశి రౌటేలాకు మంచి కాన్ఫిడెన్స్‌ ను అందించింది.అంతేకాకుండా ఈమెకు వరుసగా అవకాశాలను కూడా తెచ్చి పెడుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈమెకు మరో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్,( NTR ) దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ నీల్ మూవీలోనూ ఈ అమ్మడికి ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులోనూ కేవలం డ్యాన్స్ నెంబర్‌ కే పరిమితం కాకుండా సినిమాలో ఒక ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఊర్వశి నటించనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇలా నందమూరి హీరోల సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంటున్న ఊర్వశి రౌటేలాను తమ సినిమాల్లో తీసుకునేందుకు మిగతా మేకర్స్ కూడా ఆసక్తిని చూపుతున్నారట.ఒకవేళ ఈ వార్త గనుక నిజమైతే ఈ ముద్దుగుమ్మకు ఇంకా అవకాశాలు క్యూ కట్టడం ఖాయం అని తెలుస్తోంది.