Spread the love

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా నటించిన చిత్రం తండేల్.( Thandel ) ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.మంచి మంచి కలెక్షన్లను సాధిస్తూ ఈ సినిమా దూసుకుపోతోంది.దాంతో అక్కినేని అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు

స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో( Boyapati Srinu ) ఒక సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.పైగా ఇది చైతన్యకు 25వ సినిమా కావడం విశేషం.

ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్( Geetha Arts ) బ్యానర్ లో రూపొందనుందట.కాగా ఇప్పటికే గీతా ఆర్ట్స్ లో చైతన్య రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే.మొదటిది 100% లవ్, కాగా రెండవది ఇటీవల వచ్చిన తండేల్ సినిమా.

ఇప్పుడు బోయపాటి ప్రాజెక్ట్ ఓకే అయితే హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుందని చెప్పాలి