Spread the love

సామాన్యులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో సామాన్యులకు భారం తగ్గినట్లయింది. మొన్నటివరకు కిలో చికెన్ రూ.400 వరకు చేరుకోగా.. ఒక్కొ గుడ్డు రూ.10 పలికిలంది. ఇప్పుడు ధరలు దిగొస్తున్నాయి.

చికెన్ ప్రియులకు ఎగిరి గంతేసే వార్త. చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకు కేజీ చికెన్ రూ.350 వరకు పలకగా.. ఇప్పుడు రూ. 100 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే.. చికెన్ షాపుల ముందు క్యూ కడతారు. దీంతో సండే రోజు చికెన్ షాపులు కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. చికెన్ ధరలు తగ్గడం కస్టమర్లకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. తగ్గడానికి కారణాలేంటి..?

ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల విదేశాలకు భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో భారత్‌లో నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గాయి. ఇక వేసవికాలం కారణంగా ఫామ్స్‌లో కోళ్ల నిర్వహణ కష్టమవుతుంది. దీంతో ఫామ్స్ నిర్వాహకులు కోళ్లను వెంటనే అమ్ముకుంటున్నారు. దీని వల్ల కోళ్ల సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.